6 May, 2026 | 8:33 PM

ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

06-05-2026 08:03 PM

అచ్చంపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీశైల ఉత్తర ముఖద్వారంగా బాసిల్లుతున్న శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ అనురాధ దంపతులు బుధవారం సాయంత్రం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ఎమ్మెల్యే తన కుమారుడు డాక్టర్ యశ్వంత్ వివాహాన్ని ప్రముఖ ప్లాస్టిక్ సర్జరీ నిపుణురాలు డాక్టర్ ఎలెన్ తో జరిపించారు. వివాహానంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే దంపతులు నూతన దంపతులతో కలిసి ఆలయంలోని ఉమాసదులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వినాయకునికి మహిషాసుర మరిదిని అమ్మవారు అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు కుంకుమార్చన అభిషేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరయ్య శాస్త్రి నూతన దంపతులతో పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు వారిని మర్యాదపూర్వకంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సన్నిహితులు పాల్గొన్నారు.