అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించాలి
కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని 14వ వార్డులో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. నీటి సమస్య తో పాటు పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేకు విన్నవిం చారు. స్పందించిన ఆయన మున్సిపల్ నిధులతో సమస్యలను పరిష్కరించాలని చైర్మన్ గంగాధర్‌ను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు వార్డుల వారీగా పర్యటించి స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. సమస్యల పరి ష్కరానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా సమస్యలను పట్టించుకోకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. అధికారులు, కౌన్సిలర్లు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకు లు అంజిరెడ్డి, గురువినయ్, నార్ల రవీందర్, ఉదయ్, వహాబ్, ఎజాజ్ పాల్గొన్నారు.




