ఉల్లాసంగా.. ఉత్సాహంగా

06-05-2024 01:25:52 AM

డిజైర్ సొసైటీలో విద్యార్థుల ఆటపాటలు

పటాన్‌చెరు, మే 5 : జిన్నారం మండలం బొల్లారంలోని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంరక్షణ కేంద్రం డిజైర్ సొసైటీలో సమ్మర్ క్యాంపు ఉత్సాహంగా.. ఉల్లాసంగా నడుస్తోంది. ఆదివారం రెండో రోజు కావడంతో విద్యార్థులకు పలు సంస్థలు ఆటల పోటీలను నిర్వహించాయి. అబోర్ట్ పెడియాషుర్ టీమ్ విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా, జేపీఎంసీ హైదరాబాద్ టీమ్ ఆటల పోటీలు నిర్వహించింది. ఓరాకిల్ టీమ్ మ్యూజికల్ చైర్, జానపదగీతాల పోటీలు నిర్వహించాయి. జూనియర్ నాగార్జున, జూనియర్ బాలకృష్ణ డ్యాన్స్‌లు పిల్లలను అలరించాయి. ట్రెడెషన్స్ టీమ్ బెలూన్స్‌తో విద్యార్థులకు ఆటలు ఆడించింది. ఆయా ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డిజైర్ సొసైటీ చేస్తున్న సేవలను గుర్తించి నిర్వాహకుడు జీ రవిబాబును అబోర్ట్ టీమ్ సన్మానించింది.