1 April, 2026 | 8:15 PM

కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు

01-04-2026 06:32 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): స్థానిక భగత్నగర్ లోని సిద్దార్థ పాఠశాలలో ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమి కరీంనగర్ వారు బుదవారం రోజున నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో సిద్ధార్థ పాఠశాల సుమారు 120 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను సాధించగా, 12 మంది విద్యార్థులు బ్రౌన్ బెల్ట్, ఇద్దరు విద్యార్థులు టి. శివప్రియ, ఎస్. రిషిక్ బ్లాక్ బెల్ట్ ఒకటవ డిగ్రీ సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక అడిషనల్ డిప్యుటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వెంకట రమణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలకు ఆత్మరక్షణకై కరాటే నేర్చుకోవాలని సూచించారు. తదుపరి పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శారీరక, మానసిక దృఢత్వానికి, ఆత్మరక్షణ కొరకై కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వివిధ బెల్ట్ ను సాధించిన విద్యార్థులను ఈ  సందర్బంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దాసరి స్వప్న శ్రీపాల్ , ఉపాధ్యాయ బృందం, కరాటే మాస్టర్ పుల్లూరి శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.