హుజురాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్
01-04-2026 06:14 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాహుజురాబాద్ డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిగా గొట్టే శ్రవణ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా సేవలందించిన డాక్టర్ శ్రవణ్ కుమార్ డివిజన్లో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తానని, ప్రభుత్వ వైద్య సేవలు ప్రతి పేదవారికి అందేలా సేవలు అందిస్తానన్నారు. బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సావన్ కుమార్ ని హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బొకే అందించి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.




