21 April, 2026 | 2:45 PM

యువకుల మద్దతుతోనే పార్టీలకు మనుగడ

09-05-2024 02:35 AM

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు

మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి): యువకులు, మహిళల మద్దతుతోనే పార్టీల మనుగడ సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన యువగళం సదస్సులో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి పాల్గొని మాట్లాడారు. యువత దేశానికి పట్టుకొమ్మలని కొనియాడారు. మంచిర్యాలలో నిరుద్యోగులకు ఉపా ధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే అన్ని విధాలుగా యువతకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.