21 April, 2026 | 3:45 PM

Breaking News

33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •   కాటారంలో రైతు భరోసా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు   •  

రూ.2.50 కోట్ల విలువైన 20 కిలోల ‘హాష్’ ఆయిల్ స్వాధీనం

21-04-2026 02:26 PM

మహబూబాబాద్, (విజయక్రాంతి): గంజాయితో తయారుచేసిన అత్యంత ఖరీదైన 20 కేజీల హాష్ ఆయిల్ (గంజాయి నూనె) ను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.

గంజాయి పండించి స్మగ్లింగ్ చేస్తే డబ్బులు తక్కువ వస్తున్నాయని అదే గంజాయిని ఆయిల్ గా మార్చితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని భావించి నలుగురు వ్యక్తులు మూటగా ఏర్పడి హాష్ ఆయిల్ 40 కిలోలు తయారుచేసి అందులో 20 కిలోల ఆయిల్ ను 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి రైలు ద్వారా ముంబై కి తరలిస్తుండగా మార్గమధ్యలో వరంగల్ రైల్వే స్టేషన్లో పోలీసులన్నిగా ఎక్కువగా ఉందని గ్రహించి ఇక్కడే దిగిపోయి, బస్టాండు వైపు వెళ్తుండగా, వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు పట్టుకోగా వీరి వద్ద నుండి రెండు కోట్ల 50 లక్షల విలువైన హాష్ ఆయిల్ లభించిందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సంఘటనలో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.