ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే
31-05-2024 01:48 AM
పటాన్‌చెరు, మే 30 : ఆపదకాలంలో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన తనూజ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన రూ. లక్ష ఎల్వోసీని తనూజ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.






