25 July, 2026 | 11:36 AM

2.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు

31-05-2024 01:49 AM

గతంకంటే 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోళ్లు

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

కౌడిపల్లి, మే 30: కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ఎగుమతి చేసి సకాలం లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా ముగింపు దశకు వచ్చిందన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసినట్లు, 300 కొనుగోలు కేంద్రాలు మూసివేసినట్లు తెలిపారు. ఇంకా వంద కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ నడుస్తున్నదని, రాబోయే నాలుగు రోజుల్లో కొనుగోలు పూర్తి చేసుకొని ఆ కేంద్రాలు కూడా ముగింపు దశకు చేరుకుంటాయని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగవంతంగా పూర్తి చేసే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాణ్యత గల బియ్యాన్ని వేరే జిల్లాలకు పంపిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.