12 August, 2026 | 9:20 AM

ఘనంగా ఎమ్మెల్యే రాగమయి జన్మదిన వేడుకలు

12-08-2026 01:02 AM

విద్యార్థులకు రూ..12 లక్షల విద్యా సామాగ్రి పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్ టిఎస్ 

ఆషా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలను అభినందించిన కలెక్టర్ 

సత్తుపల్లి ఆగస్టు 11( విజయక్రాంతి): ఆషా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ జన్మదిన వేడుకలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నడుమ ఘనంగా మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ హాజరైనారు. ముందుగా ఆమె  జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి,విద్యార్థులు అందరూ కలిసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పుస్తకాలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్యాగులు, ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు పుస్తకాలు, కళాశాల యూనిఫాం ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, మోటివేషన్ క్లాసెస్ ద్వారా విద్యార్థిని,విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మార్పు తీసుకొస్తాయని,విజయాలు వరిస్తాయని అన్నారు.

రూ..12 లక్షల రూపాయలతో విద్యార్థులకు, విద్యకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయటం గొప్ప విషయం అని డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ను అభినందించారు. నియోజకవర్గంలో ఆషా స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు చూపిస్తున్న చదువుపై ప్రత్యేక శ్రద్ధ,వారి జీవన విధానాన్ని మార్చివేస్తుందని తెలిపారు.

సేవ సంస్థల ద్వారా విద్యార్థులకు ఇలా ఉపయోగపడే విషయాలు చేయాలని, ప్రభుత్వం కూడా మంచిగా సహకరిస్తుందని విద్యార్థులు ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకొని,ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో, ఎంఈఓ రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్, వైస్ చైర్పర్సన్ బొంతు సుమలత, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,కాంగ్రెస్ నాయకులు, మట్టా అభిమానులు విరివిగా పాల్గొన్నారు.