12 August, 2026 | 10:07 AM

కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడేగం సర్పంచ్

12-08-2026 09:15 AM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని ముడియం గ్రామానికి చెందిన సర్పంచ్ గౌడల్లి గంగాధర్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎమ్మెల్యే మదన్ మోహన్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ పిల్లి గంగామణి, పాలకవర్గం సభ్యులు పార్టీలో చేరారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్  చొరవతో మోడేగావ్ గ్రామంలో రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం రూ.10 లక్షలతో స్వయం సహాయక సంఘాల (SHG) భవనానికి నిధుల మంజూరుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తమను ఆకర్షించిందని తెలిపారు.కార్యక్రమంలో  మండల పార్టీ అధ్యక్షులు నల్ల మైపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు.