12 August, 2026 | 9:19 AM

Breaking News

దేవాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి   •   సీజనల్ వ్యాధుల వైద్యుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడేగం సర్పంచ్   •   లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం   •   ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ బి శ్రీధర్‌ రావు నియామకం   •   ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జేడీ ఆకస్మిక సందర్శన   •   ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల జగడం!   •   బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి   •   మల్లంపల్లిలో ఎంపీడీవో, ఎంఆర్ఓ కార్యాలయం మంజూరు పట్ల హర్షం   •  

పలు ఆలయాల్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు

12-08-2026 01:03 AM

జూబ్లీహిల్స్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పలు అమ్మవార్ల దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో గొల్లకిట్టు ప్రత్యేక ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయానికి మంగళవారం విచ్చేశారు.అమ్మవారిని దర్శించుకుని శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం రాంనగర్ గుండు ప్రాంతంలో అఖిల్ పైల్వాన్ ఆహ్వా నం మేరకు శ్రీ బంగారు ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి

అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మా ట్లాడుతూ పవిత్ర బోనాల పండుగ వేళ అ మ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు.రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.భక్తిశ్రద్ధలతో కొనసాగిన ఈ ఆధ్యాత్మిక కార్య క్రమాలలో స్థానిక నాయకులు,పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు,ఆలయ కమిటీ స భ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.