3 August, 2026 | 1:41 AM

మహంకాళి సన్నిధిలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

03-08-2026 12:00 AM

మహేశ్వరం, ఆగస్టు 2, (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం మంఖల్ 67వ డివిజన్లో శ్రీ మహంకాళి అమ్మవారిని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యా లతో ఉండాలని, మంఖల్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు విరేష్ గౌడ్, లక్ష్మయ్య, సామెల్ రాజ్, వెంకట్ రాజిరెడ్డి, రవి నాయక్, సప్పిడి రాజు, శ్రీలత, నాసర్ ఖాన్, వెంకటేష్ యాదవ్, రత్నం అశోక్, అన్వేష్, ప్రభు చారి, మాజీ సర్పంచ్ అత్తని కౌసల్య యాదవ్, శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ రమాకాంత్ గౌడ్ గారితో పాటు శ్రీలత, ప్రకాష్, విజయ భాస్కర్ రెడ్డి, నవీన్ కుమార్, శ్రీశైలం యాదవ్, పద్మారావు, శ్రీకర్ గౌడ్, ఉల్య మహేందర్, మంకాయ సాయి తదితరులు పాల్గొన్నారు.