3 August, 2026 | 1:41 AM

బోనాల ఊరేగింపు శాంతియుతంగా జరపాలి

03-08-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్,ఆగస్టు 2 (విజయక్రాంతి):  ఆషాడమాసంలో వైభంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు, పోతరాజులు, ఫలహారబండ్ల ఊరేగింపును ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆదివారం ముషీరాబాద్ లోని వినోభానగర్ లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారి పూజలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జైసింహ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం పార్శిగుట్ట వద్ద బోనాల ఉత్సవాల స్వాగత కమాన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ  బోనాల ఉత్సవాలు ముషీరాబాద్ లో వైభవంగా జరుగుతాయని, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉత్సవాలలో పాల్గొని మతసామరస్యాన్ని పెం పొందించాలన్నారు. ప్రతి యేటా రెండు రోజులపాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ శాఖ అధికారులతో మాట్లాడి కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.

తలారి శ్రీకాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ  రాబోయే సోమవారం పార్శిగుట్ట, వినోభానగర్ నుంచి పోతరాజులు, ఫల హారబండ్లు ఊరేగింపు వివిద రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనతో ఊరేగింపును పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, డివిజన్ ఉపాధ్యక్షుడు బల్ల ప్రశాంత్, పట్నం నరేష్, డివిజన్ నాయకులు పూసగోరఖ్ నాథ్, దీన్ దయాల్ రెడ్డి, బి. శ్రీనివాస్, బీఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం మీడియాసెల్ ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.