‘సర్’ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్
16-07-2026 12:00 AM
షాద్‌నగర్, జులై 15 (విజయక్రాంతి ): షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులు, పోలింగ్ బూత్లలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన ఓటర్లతో మాట్లాడి, వివరాల నమోదు మరియు దరఖాస్తుల స్వీకరణపై ఆరా తీశా రు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చా రు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని అధికారు లను, బీఎల్‌ఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ మోహన్ ముదిరాజ్, కమిషనర్ సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






