3 July, 2026 | 9:52 PM

Breaking News

ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •  

గాదిగూడ ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

12-06-2025 09:04 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గం(Asifabad Constituency)లోని గాది గుడా మండలం పిప్పిరి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం పిడుగుపాటుతో ఆరుగురు రైతులు మృతి చెందడంతో పాటు పలువురికి తీవ్రగాయాలు అయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova Lakshmi) తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె తెలిపారు. అనారోగ్యంతో హైదరాబాదులోని ఒ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని సంఘటన స్థలానికి రాలేక పోతున్నానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా రిమ్స్ సూపరింటెండెంట్ ను కోరారు. ఈ సంఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.