26 April, 2026 | 2:13 AM

గ్యారెంటీలపై నిలదీత సభలో రసాభాస

26-04-2026 12:37 AM

మహిళలకు రూ.2500పై మంత్రి వివేక్‌ను నిలదీసిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

కేసీఆరే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న మంత్రి

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలు

పోలీసుల రంగప్రవేశంతో శాంతించిన ఇరువర్గాలు

మెదక్/నర్సాపూర్, ఏప్రిల్ 25(విజయక్రాంతి): మహిళలకు నెలకు రూ. 2500 కా్ంర గెస్ ఇచ్చిన హామీ ఏమైందంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మంత్రి గడ్డం వివే క్ వెంకటస్వామిని నిలదీశారు. మంత్రి వివేక్ సభలో గందరగోళం చెలరేగింది.

మంత్రి సమాధానమిస్తూ కేసీఆర్ వేలకోట్లు అప్పులు చేసి, రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టాడని, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కూడా గత ప్రభుత్వమే కార ణమని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ధీటుగా స్పందించారు. దీంతో సభలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపచేశారు. మెదక్ జిల్లా నర్సా పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎమ్మెల్యే పలు గ్యారంటీలపై మంత్రిని నిలదీశారు. మం త్రి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గందరగోళం మధ్యే మంత్రి నర్సాపూర్ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 4, 6వ వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. నర్సాపూర్‌లో 3500 ఇళ్లు కట్టుకుం టున్నారన్నారు. రెండోదఫాలోనూ 2500 ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెండు రోజుల్లో కలెక్టర్‌తో రివ్యూ సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. గత బీఆర్‌ఎస్ పాలనలో డబుల్ ఇళ్లు ఇస్తామని చెప్పి పదేళ్లు మోసం, కాలయాపన చేశారని మంత్రి వివేక్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజయాదవ్, గ్రంథాలయ చైర్మన్ సుహాసినిరెడ్డి, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.