పెండింగ్ జీతాలు వెంటనే క్లియర్ చేయాలి
డిప్యూటీ కమిషనర్‌కి ముద్దం నర్సింహ యాదవ్ వినతి
సికింద్రాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని బోయిన్ పల్లి సర్కిల్ ఓల్ బోయిన్ పల్లి, హస్మత్ పేట్ డివిజన్ బి ఎల్ ఓలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించిన అనంతరం, ఓల్ బోయిన్పల్లి వార్డ్ కార్యాలయంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముద్దం నర్సింహ యాదవ్ మాట్లాడుతూ బిఎల్‌ఓ లు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ జీతాలు వెంటనే క్లియర్ చేయాలని డిప్యూటీ కమిషనర్ ని ముద్దం నర్సింహ యాదవ్ కోరారు.బిఎల్‌ఓ లు ప్రజలకు, ఎన్నికల సంబంధిత విధుల్లో కీలకంగా సేవలందిస్తున్నందున, వారి సమస్యలను సానుకూలం గా పరిష్కరించి గత బకాయి జీతాలను త్వరితగతిన చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.బిఎల్‌ఓ ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
అర్హులకు పింఛన్లు ఇవ్వాలి: ముద్దం నర్సింహ యాదవ్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 262, 264 డివిజన్లలో అర్హులైన వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ, వారి పింఛన్ దరఖాస్తులను డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ కి ఓల్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా సుమారు 350 మంది పేద, అర్హులైన లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పథకాల కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, ముద్దం నర్సింహ యాదవ్ తన సొంత ఖర్చులతో వారి పింఛన్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేయించారు.
అనంతరం మాజీ ముద్దం నర్సింహ యాదవ్ మాట్లాడుతూ 262, 264 డివిజన్లలో పింఛన్కు అర్హత ఉన్నప్పటికీ ఇంకా పింఛన్ అందని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేశామని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన ఆమోదం కల్పించి పింఛన్ మంజూరు చేయాలని డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ కి మాజీ ముద్దం నర్సింహ యాదవ్ స్పష్టం చేశారు.






