15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సమ్మక్క.. సారలమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

31-01-2026 12:32 AM

నిలువెత్తు బంగారం సమర్పించిన ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, జనవరి 30: (విజయ క్రాంతి): సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చిం తకుంట విజయ రమణారావు ఆ తల్లులను వేడుకోవడం జరిగిందన్నారు, శుక్రవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్లా మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర లో ఎమ్మెల్యే నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు, అలాగే గర్రెపల్లి గ్రామంలోనూ సమ్మక్క సారలమ్మ దేవతల ను దర్శించుకున్నారు.

ఎమ్మెల్యే వెంట జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్ , దనాయక్ దామోదర్ రావు, కోటగిరి రమేష్ తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, జాతర కమిటీ సభ్యులు ఉన్నారు, నీరుకుల్లా జాతర భక్తులతో కిక్కిరిసిపోయింది. వనదేవతల దర్శనం కోసం భక్తులు క్యూలైన్ కట్టారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేయడంతో ప్రశాంత వాతావరణంలో మొక్కలు చెల్లించుకున్నారు. ఎలాంటి అవంచనమైన సంఘటనలు జరగకుండా సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ చంద్రకుమార్ భారీ బందోబస్తు నిర్వహించారు. ఏర్పాట్లను తాసిల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఈవో శంకరయ్య, ఉప సర్పంచ్ సతీష్ తదితరులు ఉన్నారు. అలాగే నారాయణపూర్, గర్రెపల్లి, తొగర్రాయి గ్రామాల్లో జరిగే జాతర కు భక్తులు పెద్ద సంఖ్యల హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. నారాయణపూర్ చైర్మన్ తిరుపతిరావు, సర్పంచ్ గుడుగుల సతీష్, ఉపసర్పంచ్ రామారావు, సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్, చిలుక సతీష్ తో పాటు పలువురు ఉన్నారు.