calender_icon.png 31 January, 2026 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సమ్మక్క,సారక్క జాతర

31-01-2026 12:31:26 AM

తంగళ్ళపల్లి,జనవరి 30 (విజయకాంత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఓబులాపూర్ గ్రామంలో సమ్మక్క సారక్క జాతరను ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వ హించారు. సంప్రదాయ పద్ధతులు, ఆచారాల నడుమ జరిగిన ఈ జాతరకు మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరగా, గ్రామమంతా భక్తుల సందడితో కిటకిటలాడింది.భక్తులు తమ కుటుంబాల శ్రేయస్సు, ఆరోగ్యం, పంటల సమృద్ధి కోసం సమ్మక్క సారక్క అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు అప్పజెప్పారు.

కొందరు భక్తులు ఓడిబియాలు, బంగారం సమర్పిస్తూ అమ్మవార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని జాతరకు మరింత శోభను తీసుకొచ్చారు.ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా స మ్మక్క సారక్క ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవార్లను ప్రతిష్టించిన గద్దెల చుట్టూ భక్తులు భజనలు, డప్పుల నృత్యాలతో ఊరేగింపుగా సంచరించారు. ఈ సందర్భంగా ఓబులాపూర్ గ్రామం మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

గ్రామంలోని వీధులు భక్తులతో నిండగా, అమ్మవార్ల నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి.జాతర సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి భ క్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. తాగునీరు, ప్రసాదం, దర్శన క్యూ ల నిర్వహణ వంటి ఏర్పాట్లు సక్రమంగా చేశారు. పోలీసులు, వాలంటీర్లు భద్రత చర్యలు పటిష్టంగా చేపట్టి శాంతియుతంగా జాతర కొనసాగేందుకు సహకరించారు.భారీ ఎత్తున ప్రజలు పా ల్గొనడంతో ఓబులాపూర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవం కలగలిసిన ఈ సమ్మక్క సారక్క జాతర ఓబులాపూర్ గ్రామ చరిత్ర లో మరోసారి గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.