calender_icon.png 9 January, 2026 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతున్న బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

08-01-2026 05:59:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా చెందిన పలువురిని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలం జాం గ్రామానికి చెందిన మలుకుల భోజన్నతో పాటు కౌట్ల (బి) గ్రామ మాజీ సర్పంచ్ మోహన్ లను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పరామర్శించిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి, జాం గ్రామ సర్పంచ్ విలాస్ తో పాటు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.