19 August, 2026 | 3:30 AM

సలీం పాషా కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యాదయ్య

19-08-2026 01:23 AM

శంకర్ పల్లి ఆగస్టు 18 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా టి యు డబ్ల్యూ జే అధ్యక్షుడు ఎండి సలీం పాషా కుటుంబాన్ని మంగళవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పరామర్శించారు. ఇటీవల సలీం పాషా తల్లి  మృతి చెందడం జరిగింది. వారి ఇంటికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చేకూర్త గోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, స్థానిక నాయకులు రాఘవేందర్ తదితరులు ఉన్నారు.