సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో పయనిద్దాం
జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య
జవహర్‌నగర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యే అని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు. భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాడి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన ధీరుడని కావ్య కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని అంబేద్కర్ నగర్ లో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ పాపన్న గౌడ్ లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు.
సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపడానికి ఎంతో కృషి చేశారని అన్ని వర్గాలు ప్రజలు ఒకటేనంటూ ఆనాడే చాటి చెప్పారని గుర్తు చేశారు. మహనీయుల ఉత్సవ కమిటీ ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో జిట్టా శ్రీనివాస్ రెడ్డి, కొండల్, సంగీత రాజశేఖర్, రవి, వెంకటేష్ గౌడ్, సింగం బాలరాజు పటేల్, పంతంగి సిద్ధులు యాదవ్, ప్రసాద్ గౌడ్ ,మహేష్, సోమయ్య గౌడ్, సాయి, దిలీప్, అశోక్, బిఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.






