28 June, 2026 | 7:12 AM

రాష్ట్రాభివృద్ధికి అంకితమవుతాం

06-09-2025 12:09 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు 
  2.  మమ్ములను నాడు కేసీఆర్ అవమానించారు 
  3.  గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ చైర్మన్ గొల్కొండ సతీష్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : గ్రామ రెవెన్యూ అధికారులను అసెంబ్లీ వేదికగా గత సీఎం కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి న్యాయం చేశారని తెలంగాణ విలేజ్ రెవెన్యూ అధికారుల జేఏసీ అధ్యక్షులు గొల్కొండ సతీష్, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్టంలో తాము 5,106 మంది గ్రామ రెవెన్యూ అధికారులుగా ఉన్న తాము రోబోలుగా కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి అంకితమవుతానని, రైతుల సేవలో నిరంతరం పని చేస్తామని  శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూనే.. భూ సమస్యలను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పరిష్కరించేలా కట్టుబడి పని చేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దిశానిర్దేశం మేరకు ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని గోల్కొండ సతీష్ పేర్కొన్నారు.   మాజీ వీఆర్వోలు, ప్రస్తుతం జీపీవోలుగా నియామక పత్రాలు అందుకున్న వారి సమస్యల  పరిష్కారం కోసం తమ జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.