28 July, 2026 | 4:45 PM

నాలాలో దిగి ఎమ్మెల్యే నిరసన

25-06-2024 04:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి) : మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ మీర్జాల్ గూడ నుంచి రాజా శ్రీనివాస్ నగర్ వర కు నాలా పనులను తక్షణమే చేపట్టాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఓల్డ్ మీర్జల్‌గూడ, శ్రీనివాస్ నగర్, రాజా నగర్, వెంకటాద్రి నగర్ పరిసర ముంపు ప్రాంతాల ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నాలాలోకి దిగి ధర్నా చేపట్టారు. ఆదివారం కురిసిన వర్షానికి మల్కాజిగిరిలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మురుగు నీరు చేరి దుర్గంధం వస్తుండటంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్, కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం కారణంగా మీర్జాల్‌గూడ నుంచి రాజ శ్రీనివాస్ నగర్ వరకు బాక్స్ డ్రైయిన్ (నాలా) పను లు నిలిచి పోయారన్నారు. నాలాలో పేరుకుపోయిన వ్యర్థాలు, చెట్టు కొమ్మలను తొలగించని కారణంగా వరద నీరు ఇళ్లలోకి చేరుతుందన్నారు. ఈ సమస్యపై గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో పాటు కింది స్థాయి అధికారులకు ఎన్ని వినతు లు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సమస్యను తక్షణమే పరిష్కరిం చాలని లేదంటే, పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత రాము యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.