బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
06-05-2026 01:56 AM
అలంపూర్ ఏప్రిల్ 5: గత నెల 27న వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను డీసీఎం ఢీకొన్న ఘటనలో వడ్డేపల్లి మండలం కోవెలదిన్నె గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు తిక్కారెడ్డి, కృష్ణారెడ్డి చంద్రమోహన్ రెడ్డి మృతి చెందడంతో పాటు మరో ఇద్దరు నరసింహ గౌడ్ కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.దీంతో కోవెలదిన్నె గ్రామంలో పెను విషాదం చోటు చేసుకున్న సంగతి విదితమే.
విషయం తెలుసుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు బాధిత కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. ప్రమాదంకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని నింపారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.






