16 August, 2026 | 8:32 PM

బోండ్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

16-08-2026 07:41 PM

భిక్కనూర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): భిక్కనూర్ పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త బోండ్ల రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదివారం రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.