16 August, 2026 | 8:38 PM

రేపు బాలాజీ నగర్ సబ్-స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

16-08-2026 07:48 PM

విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ సాంబశివరావు  

జవహర్ నగర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): బాలాజీ నగర్: 33/11 కేవీ బాలాజీ నగర్ సబ్-స్టేషన్ పరిధిలోని 11 కేవీ శివాజీ నగర్ ఫీడర్ కింద నిర్వహణ పనులు, పీఎమ్‌ఐ పనులు చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా 17వ తేదీన  విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు బాలాజీ నగర్ అసిస్టెంట్ ఇంజనీర్ హెచ్. సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.

షెడ్యూల్ వివరాలు:

తేదీ: 17-08-2026 సోమవారం

సమయం: ఉదయం 10:00 గంటల నుండి 11:00 గంటల వరకు 1 గంట పాటు

ఫీడర్: 11 కేవీ శివాజీ నగర్ ఫీడర్

ప్రభావితమయ్యే ప్రాంతాలు:

కెసిఆర్ మార్కెట్ రోడ్ ఎదురుగా ఉన్న ప్రాంతం, సంతోష్ నగర్, సుక్కమ్మ కాలనీ, విఘ్నేశ్వర కాలనీ, శివాజీ నగర్, సుభద్రమ్మ కాలనీ, భద్రయ్య వెంచర్, కళ్యాణ్ సులోచన, కళ్యాణ్ రాఘవ, వికే ఎన్‌క్లేవ్ మరియు వాటి చుట్టుపక్కల ప్రాంతాలు. ఈ శ్రమదాన పనులకు వినియోగదారులు, ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు. సేవలకు కలిగే అంతరాయానికి చింతిస్తున్నామని తెలిపారు.