బెజ్జూరులో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
27-03-2026 08:04 PM
పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. బెజ్జూరు మండలంలోని బెజ్జూరు, ఎలుక పెళ్లి, కృష్ణ పల్లి పాపన్నపేట, సలుగు పల్లి, చిన్న సిద్దాపూర్ తదితర గ్రామాల్లో సీతారాముల కళ్యాణం మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి గ్రామాల్లో శోభాయాత్ర నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని రంగనాయక దేవాలయం, ఎలుకపల్లి బి అభయాంజనేయ ఆలయాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండేవిటల్ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు.




