11 August, 2026 | 1:52 AM

‘నీట్’ విద్యార్థులకు ఎమ్మెల్సీ సన్మానం

11-08-2026 12:39 AM

షాద్‌నగర్, ఆగస్టు 10(విజయక్రాంతి): నీట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అభినందించి సన్మానించారు. కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన వైష్ణవి, రక్షిత ర్యాంకులు సాధించగా.. షాద్నగర్‌లోని ఆఫీసర్స్ కాలనీకి చెందిన వై.ఆదిత్య ఎంసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. వై ష్ణవి, రక్షితల ఉన్నత చదువుకు కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. కార్యక్రమంలో ఇప్పలపల్లి సర్పంచ్  మంజుల, పోమాల్‌పల్లి  స్వప్న, తుర్పుగడ్డ తండా సర్పంచ్ థౌర్య, మాజీ కౌన్సిలర్లు నర్సిమ, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.