నాగోల్ ఇన్‌స్పెక్టర్ పరుశురాంపై బదిలీ వేటు
23-06-2024 04:22 PM
హైదరాబాద్: నాగోల్ ఇన్‌స్పెక్టర్ పరుశురాంపై బదిలీ వేటు పడింది. ఎస్సై మధు, ఏఎస్సై అంజయ్య సస్పెండ్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.






