12 March, 2026 | 11:45 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

విద్యార్థులు ఉద్యోగులతో ఎమ్మెల్సీ మల్లన్న ముఖాముఖి

12-03-2026 04:59 PM

హనుమకొండ, మార్చి 12(విజయ క్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలను తెలుసుకోవటానికి శుక్రవారం మార్చి 13న విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ నందు ఉదయం 11 గంటలకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొనాలని కాకతీయ విశ్వవిద్యాలయం బీసీ టీచర్స్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు డాక్టర్ గడ్డం కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, పార్ట్ టైం అధ్యాపకులు నాన్ టీచింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోటానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విశ్వవిద్యాలయంలో ముఖాముఖిగా పాల్గొంటున్నారు కాబట్టి సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మల్లన్నతో జరిగే ముఖాముఖి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిసి టీచర్స్ అసోసియేషన్ సలహాదారులు డాక్టర్ తిరునహరి శేషు, ఉపాధ్యక్షులు డాక్టర్ బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్, డాక్టర్ చారి,డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.