3 May, 2026 | 4:20 PM

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలి

12-03-2026 05:01 PM

కార్యదర్శి నవీన్ రెడ్డి

వేములపల్లి మార్చి 12 విజయ క్రాంతి: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కార్యదర్శి నవీన్ రెడ్డి ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డిలు అన్నారు. గురువారం శెట్టిపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం పిల్లలకు సకాలంలో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థుల నుండి భోజనం సక్రమంగా లేదని వదంతులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు.