calender_icon.png 23 December, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్సీ పోచంపల్లి

22-12-2025 11:35:45 PM

కాకతీయ విశ్వవిద్యాలయం,(విజయక్రాంతి): హన్మకొండ, నడికూడ మండలంలోని స్వగ్రామమైన వరికోలు గ్రామంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎంతో ఆదర్శంగా 2014 నుండి జరిగిన ప్రతి ఎన్నికలు ఏకగ్రీవం చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మొదటి నుండి వరికోలాటనే శ్రీనివాసరెడ్డి... శ్రీనివాసరెడ్డి అంటేనే వారికోల్ ఏది జరిగినా తన సొంత ఖర్చులతో తన సొంత పర్యవేక్షణలో జరిగితే అభివృద్ధి చెందుతుంది.

తన సొంత ఖర్చుతో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడా లేని విధంగా విశాలమైన గ్రామపంచాయతీ గత అధికారంలో ఉన్నప్పుడు దాన్ని  కేటీఆర్ గారితో ప్రారంభం చేయించిన చిన్న గ్రామపంచాయతీ తనకు ఎంత కష్టం వచ్చినా ఎన్ని నిధులు తన వంతు సాధ్యమైతే అన్ని నిధులు వర్కులకు తీసుకొని వచ్చి అభివృద్ధిలో నా సొంత గ్రామమైన వర్కోలుకు నేను ముందు ఉంటానని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది.

వచ్చే ఎన్నికలలో ఎంపీటీసీ జడ్పిటిసి కూడా ఇలాగే భారీ మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని వారికోల్ ప్రజలను వేడుకొని ప్రమాణస్వీకారం ని విజయవంతం చేశారు. అవసరమైతే తన సొంత నిధులనుండైనా ప్రత్యేకంగా గ్రామ అభివృద్ధికి నడికొండ మండలానికి నేను ఖర్చు పెడతానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందర్నీ ఎలక్షన్లో పనిచేసిన వాళ్లందరికీ పేరుపేరునా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది.