23-12-2025 12:00:00 AM
నవాబ్‌పేట, డిసెంబర్ 22 : నవాబుపేట గ్రామం నడిబొడ్డున నిరుపయోగంగా ఉన్న పాత గ్రామ పంచాయతీ భవనం ’ప్రజావేదిక’గా రూపుదిద్దుకుంది. నూతన సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వి.గీతారాణి సోమవారం ఈ వేదికను ప్రారంభించారు. తన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న జె.కె. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ భవనాన్ని ఆధునీకరించి, ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పేట్ నూతన సర్పంచ్ వి.గీత రాణి, ఉప సర్పంచ్ ఎండి అజార్ అలీ,ట్రస్ట్ చైర్మన్ వి.నరసింహ చారి, డైరెక్టర్ సుధాకర్ చారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.