calender_icon.png 23 December, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీ ప్రమాణస్వీకారం చేసిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు

23-12-2025 12:00:00 AM

సర్పంచులకు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జీఎంఆర్

అడ్డాకుల, డిసెంబర్ 22 : దేవరకద్ర నియోజకవర్గం ఆయా గ్రామాలలో నూతనంగా సర్పంచులు వాడు సభ్యులుగా పదవి బాధితులు స్వీకరిస్తున్న గ్రామ సర్పంచ్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం ఉదయం అడ్డాకుల గ్రామపంచా యతీ లోని గ్రామాలు సచివాలయ కార్యాలయంలో నూతనంగా సర్పంచులుగా పదవి స్వీకరణ ప్రమాణస్వ కార్యక్రమం భాగంగా అడ్డాకుల సర్పంచిగా బొక్కలపల్లి దశరథరెడ్డి, ఉప సర్పంచ్‌గా సాయిసాగర్, వాడ నెంబర్ ప్రమాణ స్వీకారం చేశారు.

అంతకుముందు సర్పంచ్ కి ఉపసర్పంచ్ కి వార్డు సభ్యులకు శాలువతో ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా అన్నయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రధాన పాత్ర గ్రామ సర్పంచులు వాడు సభ్యుల ధ్యాని ప్రజలు అవసరమయ్యే మౌలిక వసతులను సమకూర్చాలని ఈ సందర్భంగా సూచించారు. గ్రామ ప్రాంతంలో ప్రజలు ఎంతో నమ్మకంగా సర్పంచులుగా వార్డ్ సభ్యులుగా ఎన్నుకున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉంటూ రామాపురం కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.

నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మంచి జరగాలని ప్రజా పాలన ప్రభుత్వం అభివృద్ధి చేసుకుందామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శేఖర్, ఎంపీడీవో, మాజీ ఎంపీపీ నాగార్జున రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీహరి, నాగిరెడ్డి,విజయ్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హనుమంతు, సంజీవరెడ్డి, గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా నూతన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

రేవల్లి, డిసెంబర్ 22 : మండలంలోని అన్ని గ్రామ  పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా, డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, మద్దతుదారులు నూతన సర్పంచ్ వార్డు సభ్యులను పూలమాలతో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే 

అలంపూర్, డిసెంబర్ 22 : అలంపూరు పరిధిలోని ఎర్రవల్లి గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా ఎన్నికైన అనిత కృష్ణసాగర్ , కొండేరు గ్రామ సర్పంచ్ గా ఈరన్న సోమవారం అధికారకంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శి సర్పంచు ఉపసర్పంచ్ వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఎమ్మెల్యే నూతన పరిపాలక కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ.... గ్రామాలను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో నడిపించాలని నూతన సర్పంచులకు సూచించారు. నాయకులు తిమ్మాపురం నారాయణ, తదితరులు పాల్గొన్నారు

ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ చిట్టిబాబు 

అడ్డాకుల, డిసెంబర్ 22 : అడ్డాకుల మండల పరిధిలోని పెద్దమనగల్ చేడ్ గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిట్టిబాబు విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గా చిట్టిబాబు  మరియు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ  కుల, మత భేదాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాననిఅన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్వేత, సంజీవరెడ్డి, వాడు సభ్యులు పాల్గొన్నారు.

కొలువుదీరిన కొత్త సర్పంచులు

రాజాపూర్, డిసెంబర్ 22 : గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచులే కీలకం. దాదాపు రెండు సంవత్సరాల క్రితం సర్పంచులు పదవి పూర్తి అయింది. ఈ రెండు ఏడ్లు గా పల్లెలో అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ నెల 11న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సోమవారం నూతన సర్పంచులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజాపూర్ మండలంలో 24 గ్రామాలకు నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా ప్రజలు వివిధ పార్టీల నాయకులు నూతన సర్పంచులకు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు గ్రామభివృద్ధికి పాటుపడాలని కోరారు.

పెద్ద ఆముదాలపాడు సర్పంచ్‌గా పావని రెడ్డి ప్రమాణ స్వీకారం 

అలంపూర్, డిసెంబర్ 22 : మానవపాడు మండల పరిధిలోని పెద్ద ఆముదాలపాడు గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా ఎన్నికైన పావని రెడ్డి సోమవారం అధికారకంగా పదవి బాధ్యతలు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కార్యదర్శి ప్రవీణ్ ,సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పావని రెడ్డి మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్తులు సర్పంచ్ పావని రెడ్డి ఉప సర్పంచ్ వార్డు సభ్యులను పూలమాలలు శాలువా కప్పి సన్మానించారు.

ఘనంగా ప్రమాణస్వీకారాలు 

గోపాలపేట, డిసెంబర్ 22 : గోపాలపేట మండలంలో సర్పంచ్ల ప్రమాణస్వీకారం ఘనంగా జరిగాయి. 2025 సంవత్సరంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ మేరకు సోమవారం మండలంలోని 15 గ్రామాల సర్పంచులు. ఉప సర్పంచులు వార్డు సభ్యులు అందరూ ఒకేసారి ప్రమాణ స్వీకారాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శి అధికారులు నూతనంగా గెలిచిన సర్పంచ్లచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు మాట్లాడుతూ. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామాల ప్రజలకు మా ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా మా ప్రజల కు సేవ చేసుకునేందుకు వారి  సమస్యలను పరిష్కరించేందుకోసం దేవుడు మాకు ఈ అవకాశం ఇప్పించాడని అన్నారు. ప్రజలకు సేవలు చేస్తూ వారి సమస్యలన్నీ పరిష్కరిస్తూ గ్రామంలోనే ప్రజలకు అందుబాటులో ఉండి తాము చేయవ చేసుకుంటామని అన్నారు.కార్యక్రమంలో అన్ని గ్రామాల గ్రామపంచాయతీల అధికారులు నూతన సర్పంచులు ప్రజలు పాల్గొన్నారు.

కొలువుదీరిన నూతన పాలకవర్గం 

చిన్నంబావి, డిసెంబర్ 22 : మండలంలోని అన్ని గ్రామాలలో నూతన పాలకవర్గం  అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలలో 17 మంది సర్పంచులు,17 మంది ఉపసర్పంచులు,156వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

మండలంలో 17 గ్రామపంచాయతీ  సర్పంచుల వివరాలు వెలటూర్ బెక్కెం సుజాతమ్మ,లక్ష్మి పల్లి ఇటీక్యాల పెంటమ్మ,కొప్పునూర్ వడ్డేమాన్ బిచ్చన్న, చిన్నంబావి దివ్య శ్రీ,పెద్ద మారుర్ కేతపగా జయమ్మ,మియ్యపూర్ ఓడేఆంజనేయులు,చిన్నమారుర్ శంకర్, కాలూరు పెబ్బెట్టి లీలావతి,వెలుగొండ శరత్ రెడ్డి,గడ్డ బస్వాపురం చంద్రకళ, పెద్దదగడ ఉడతల భాస్కర్,దగడపల్లి కొమ్ము గంగాధర్,బెక్కెం కమలా బాయి,గూడెం వెంకట్ రెడ్డి,చెల్లపాడు పెద్ద నరసింహ, అమ్మపల్లి కవిత ప్రమాణస్వీకారం చేశారు.

తప్పెట్ల మోర్సు సర్పంచ్‌గా ఆశీర్వాదం ప్రమాణ స్వీకారం

గట్టు డిసెంబర్ 22 :  గట్టు మండల తప్పెట్ల మోర్సు గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన ఆశీర్వాదం సోమవారం అధికారంగా పదవి బాధ్యతలు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ ఆశీర్వాదం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిని అంకితభావంగా పనిచేస్తారని మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామన్నారు.