10 August, 2026 | 5:02 AM

ఫీర్జాదిగూడలో బోనాల జాతర

10-08-2026 01:16 AM

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఫీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం బోనాల జాతర అత్యంత వైభవం గా జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకు న్నారు. అమ్మవారి ఆలయాన్ని టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యు లు ఘన స్వాగతం పలికారు. తీన్మార్ మల్లన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగమ్ యాదవ్, సీనియర్ నాయకులు రంగన్న, యూత్ జనరల్ సెక్రెటరీ వీరమల్ల అనిల్, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.