ఎమ్మెల్సీ కవిత సస్పెన్ష్‌ను స్వాగతిస్తున్నా
03-09-2025 12:48 AM
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ
మెట్ పల్లి, సెప్టెంబర్ 2:(విజయ క్రాంతి) పార్టీ నియామవాలి ఉల్లంగించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్‌ఎస్ పార్టీ విధించిన సస్పెన్షన్ను తాను స్వాగతిస్తున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమా అన్నారు. మెట్ పల్లి మండలం మారుతినగర్ లో మంగళవారం ఆమె మా ట్లాడుతూ ఇటీవల కవిత మాట్లాడిన మాట లు బీఆర్‌ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ అని, అలాంటి పార్టీపై ఆమె వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. కేసీఆర్ గొప్ప నాయకుడని ఆయన మార్గదర్శ నం లో ముందుకు సాగుతామనిఅన్నారు.






