18 April, 2026 | 11:33 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కాంగ్రెస్‌కు ఎమ్మార్పీఎస్ మద్దతు

29-04-2024 01:15 AM

యాదాద్రిభువనగిరి, ఏప్రిల్ 28(విజయ క్రాంతి) : కాంగ్రెస్‌కు ఎమ్మార్పీఎస్ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిగ లను అణచివేసిందని, మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం, దళితబంధు పేర్ల మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు. అనంతరం చామల కిరణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మాదిగ జాతికి, వారి సంక్షేమం, వారి అభివృద్ధి, రాజకీయ అవకాశాల కోసం నేను వారి పక్షాన ముందుండి పోరాటం చేస్తానని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్, జనగామ జిల్లా ఇన్‌ఛార్జి కన్నారం పరశురాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంఘపాక ఏసోజు, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి నల్ల నర్సింగ్‌రావు, రాష్ట్ర నాయకులు నాగరాజు, బూసి మహేష్, బొట్ల శ్రీను, స్వామి, సురేశ్, గంగారం రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.