17 July, 2026 | 1:42 PM

Breaking News

కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •   హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు   •  

ప్రజలకు ఎంఎంటీఎస్ శుభవార్త

14-09-2024 12:02 AM

నిమజ్జనం సందర్భంగా సర్వీసులు పెంపు 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచు తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే శుక్రవారం ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యా ర్థం ఈ నెల 17, 18 తేదీలలో రాత్రిపూట కూడా నిరంతరాయంగా సర్వీసులను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఎంఎంటీఎస్ షెడ్యూల్..  

17వ తేదీ రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్(నాంపల్లి) నుంచి లింగంపల్లికి సర్వీసు నడపనున్నారు. అదేవిధంగా రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, 18వ తేదీ అర్ధరాత్రి 12.10 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు, 12.30 గంటలకు హైదరాబాద్ నుంచి లింగంపల్లికి, 1.50 గంటలకు లింగంపల్లి నుంచి హైదరాబాద్ వరకు, 2.20 గంటలకు ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌కు, 3.30 గంటలకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు, తెల్లవారుజామున 4.00 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఎం ఎంటీఎస్ సర్వీస్‌లను నడపనున్నారు.