236 మొబైల్స్ బాధితులకు అప్పగింత
25-07-2026 02:20 AM
వనపర్తి, జూలై 24 (విజయక్రాంతి): పోగొట్టుకున్న 236 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రం లోని ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరం లో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ సుమారు రూ.65 లక్షల విలువైన ఈ మొబైళ్లను సీఈఐఆర్ వ్యవస్థ సహాయంతో మూడు ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేశాయని తెలిపారు.
మొబైల్ ఫోన్లకు బలమైన పాస్వర్డ్లు ఉపయోగించాలని, ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఎస్పీ సూచించారు. మొబైళ్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాలను నగదు బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






