రీ -సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
25-07-2026 02:18 AM
అదనపు కలెక్టర్ వినోద్ కుమార్
ఖిల్లా ఘనపురం జూలై 24 : ఘన్పూర్ మండలం మల్కాపూర్లో నిర్వహించిన ల్యాండ్ రీ-సర్వే పైలట్ ప్రాజెక్టు గ్రామసభలో శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ పాల్గొన్నా రు. భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, రైతులు అధికారులకు సహకరించాలని సూచించారు. అలాగే ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు.






