30-07-2025 01:11:25 AM
శంకర్ పల్లి, జులై 29: డైరెక్టరేట్ జనరల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సూచనల మేరకు, సీఐఎస్ ఎఫ్ యూనిట్, బీడీఎల్ భానూర్ ఫైర్ వింగ్ సమన్వయంతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో అగ్నిమాపక భద్రత , విపత్తు నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. బీడీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ సి శ్రీ రాం తేజస్వి, అసిస్టెంట్ కమాండెంట్ అర్షద్ అలీ ఖాన్ , వారి బృందం విద్యార్థులతో పా టు పాఠశాల ప్రిన్సిపాల్ సునీతకు , ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వివిధ విపత్తుల నుంచి తమను తాము, ఇతరులను ఎలా రక్షించుకోవాలో నేర్పించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సునీత ఈ కార్యక్రమా న్ని నిర్వహించిన సీఐఎస్ ఎఫ్, బీడీఎల్ బృందాలకు ధన్యవాదాలుతెలిపారు.