30-07-2025 01:09:39 AM
ఆదిలాబాద్, జూలై ౨౯ (విజయక్రాంతి): ఆయుర్వేద వైద్యం పేరుతో అనారోగ్యం నయమవుతుందని నమ్మబలికి బాధితులకు నకిలీ ఆయుర్వేద మందులు అందజేసి డబ్బు లు లూటీ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ లో మంగళవా రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడిం చారు.
అరెస్ట్ అయిన వారి నుండి 6 ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డు లు, నకిలీ ఆయుర్వేదిక్ మందులు, 10 వేల నగదు స్వాధీనం, బ్యాంకు నందు 23 వేల నగదు సీజ్ చేశామన్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ లో 5, టూ టౌన్ లో 1, మావలలో 2 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారే టార్గెట్ గా ముఠా సభ్యులు మోసాలు పాల్పడ్డారని అన్నారు.
ఈ కేసులో 9 మంది పై చీటింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు. ముఠా సభ్యుల్లో A1 కుమార్ అలియాస్ బాబా పరా రీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. శేఖర్, పెంద్రే కుమార్, గోలార్ సంతోష్, కొండంగల్ అమ్రేశ్, గోలార్ ఆనంద్, యలిగర్ హజ్రత్, నగేష్, అనిల్ కుమార్ లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులందరూ కర్ణాటక కు చెందిన వారుగా గుర్తించామన్నారు.
ఆది లాబాద్ పట్టణంలో సాయి ఆయుర్వేదిక్ మం దుల దుకాణం పేరుతో ముఠా నిర్వహిస్తున్న ఈ మోసం ను జిల్లా పోలీసులు బట్టబయలు చేశారన్నారు. ఈ ముఠా సభ్యులు విడివిడిగా కొందరు పలు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో, పలు సూపర్ మార్కెట్ల వద్ద ఉంటూ అనారోగ్యంతో ఉన్న బాధితులను అందులో ముఖ్యంగా చిన్నపిల్లలను మహిళలను, వృద్ధు లను గ్రహించి వారిని సంప్రదించి తమ కుటుంబ సభ్యులకు సైతం ఇదేవిధంగా సమస్య ఉండేదని దానికి ఒక ఆయుర్వేద బాబా ద్వారా తమ అనారోగ్య సమస్యలు నయం అయి,
పూర్తి పరిష్కారం లభించిందని తెలిపి వారి వద్ద నుండి మొబైల్ నెంబర్లను సేకరించి కీలక ప్రధాన సూత్రధారి అయిన కుమార్ అలియాస్ బాబా కు అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయన వారి కి ఫోన్ ద్వారా సంప్రదించి తాను ఒక ఆయు ర్వేద వైద్యుడునని వివరాలను, సమస్యలను తెలుసుకుని ఈ సమస్యలకు పరిష్కారం ఉందని నమ్మబలికి, తన కుమారులను పంపిస్తానని చెప్పి ఆదిలాబాద్ లో ఉన్న తన ముఠా సభ్యులను వారి ఇంటికి పంపిస్తార న్నారు.
తమవద్ద ఉన్న వస్తువులతో ఒక మిశ్ర మాన్ని తయారు చేసి, ఈ మిశ్రమం ఒక ఆయుర్వేదిక్ దుకాణంలో లభిస్తాయని నమ్మబలికి, వారిని వెంట పేట్టుకొని ఐదు గ్రాములు, 10 గ్రాములు సంబంధించిన నకిలీ మూలికలను, ఒక గ్రాము రూ. 5,000 నుండి రూ. 10000 చొప్పున బాధితులకు అమ్మి, లక్షలలో దండుకోవడం, మోసం చేయడం వీరి ముఠా చేస్తున్న అక్రమ దందా అని గుర్తిం చమన్నారు.
వీరందరూ ఇదివరకే సూర్యాపేట, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలలో ఇలాంటి మోసాలకు పాల్పడి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మోసాలకు పాల్పడడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి బాబాలను మూఢనమ్మకాలను నమ్మవద్దన్నారు. ఈ సమావేశంలో డిఎస్పి జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.