19-01-2026 08:33:02 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నెల్లూరు జిల్లాలోని ఇస్రోలోని సతీష్ ధావన్ అంతరిక్షం కేంద్రం సందర్శించడానికి నాగిరెడ్డిపేట్ మండల్ గోపాల్పేట్ మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థి ర్యాకల లావణ్య ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్పేట్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాంప్రసాద్ మాట్లాడుతూ...జిల్లా యంత్రాంగం సందర్శన కోసం ఎంపిక చేసిన 50 మంది విద్యార్థుల బృందంలో నాగిరెడ్డిపేట్ మండల్ గోపాల్పేట్ మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థి లావణ్య ఎంపికలో ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.విద్యార్థులకు ఇస్రో సంస్థను సందర్శించే అవకాశం కల్పించినందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్,డీఈవో రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు పాఠశాల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తెలియజేశారు.