19-01-2026 08:38:31 PM
ఆర్టీసీ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపిన ఏరియా వైస్ ప్రసిడెంట్ నాగెల్లి
మణుగూరు,(విజయక్రాంతి): సింగరేణి కార్మికులు నివాసం ఉండే పీవీ కాలనీ ఏరియా మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీస్ లు సోమవారం నుంచి తిరిగి పున ప్రారంభం కావటం పట్ల ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమితి సింగారం ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆర్టీసీ యాజమాన్యం సుమారు రెండు నెలల నుంచి పీవీ కాలనీ ఏరియాకు బస్ సర్వీస్ లు నిలుపుదల చేయడం జరిగిందని తెలిపారు.
దీంతో బస్ సర్వీస్ లపై ఆధా రపడిన కార్మిక కుటుంబాలు అనేక ఇబ్బందులు, అవస్థలు ఎదుర్కొన్నారని ముఖ్యంగా మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కార్మిక కుటుంబాలు ఇబ్బందు లను వివరిస్తూ స్థానిక డిపో మేనేజర్ శ్యామ్ సుందర్ కు వినతి పత్రాన్ని అందజేయడంతో టీబీజీకేఎస్ చేసిన విజ్ఞప్తి పీవీ కాలనీ ఏరియా ప్రయాణికుల శ్రేయస్సును దృష్టి లో ఉంచుకొని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామ్ సుందర్ సోమవారం నుంచి కాలనీ ఏరియా మీదుగా బస్ సర్వీస్ లు కొనసాగించడానికి ఆదేశాలు ఇవ్వడం సంతోషకరమైన అంశం చెప్పారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఖమ్మం అర్ఎం శరీరామ్ నాయక్ కు, డిపో మేనేజర్ శ్యామ్ సుందర్ కు, సూపరిండెంట్ సురేందర్ కు, కాంట్రాక్టర్ కిషోర్ నాయక్ కు కృతజ్ఞతలు తెలి పారు.