calender_icon.png 19 January, 2026 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంజయ్య జాతీయ అవార్డు గర్వకారణం: ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్

19-01-2026 08:03:40 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్ క్యాంపస్ సోషల్ వర్క్ విభాగధిపతి అంజయ్య జాతీయ స్థాయి అవార్డు సాధించడం గర్వకారణమని క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ అన్నారు. సోమవారం క్యాంపస్‌లో అంజయ్యను ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... అంజయ్య సామాజిక సేవల రంగంలో అందిస్తున్న విశేష సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.