15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

జాతీయస్థాయిలో మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

26-11-2025 12:00 AM

గుండాల, నవంబర్ 25(విజయ క్రాంతి) :వాలీబాల్ క్రీడలో జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంస పత్రాన్ని అందుకున్నాడు మోడల్ స్కూల్ విద్యార్థి కొర్న సాత్విక్.  69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి క్రీడల్లో అండర్ 19 వాలీబాల్ విభాగంలో గుండాల ఆదర్శ పాఠశాలలో చదువుతు, క్రీడల్లో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించాడు. అతని ఆట తీరును గుర్తించిన క్రీడా నిర్వాహకులు జాతీయ స్థాయి టోర్నమెంట్ కి ఎంపిక చేశారు.

ఇటీవల   మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగాపూర్ లో జరిగిన జాతీయస్థాయి  బాలుర వాలీబాల్ క్రీడల్లో పాల్గొని ప్రశంస పత్రం అందుకున్నాడు. ఈ సందర్భంగా మంగళవారం  పాఠశాలలో విద్యార్థి సాత్విక్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పి. మహేష్ లను పాఠశాల ప్రిన్సిపాల్ జి. రాము , ఉపాధ్యాయులు అభినందించారు.