calender_icon.png 26 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీషీటర్ల కదలికలను ఆకస్మిక తనిఖీ..

25-11-2025 10:20:47 PM

రౌడీ షీటర్లు మారండి మంచిగా బతకండి..

ఇళ్ల వద్దకే వెళ్లి పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఎన్నికల్లో శాంతి భద్రతకు భంగం కల్పిస్తే కఠిన చర్యలు

ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాలపై పూర్తిస్థాయి నిఘా

జిల్లా ఎస్పీ సునిత రెడ్డి

వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలోని జంగాలగుట్ట, సాయినగర్ కాలనీలలో రౌడీషీటర్ల ఇళ్ల వద్దకు అకస్మాత్తుగా వెళ్లి వారి కదలికలను ప్రత్యక్షంగా జిల్లా ఎస్పీ సునిత రెడ్డి పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అశాంతి కార్యకలాపాలు, బెదిరింపులు, గుంపుగా తిరగడం, దాడులకు ప్రేరేపించడం, ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నాలు కఠినంగా శిక్షార్హమని స్పష్టం చేశారు. చట్టం అందరికీ ఒకటేనని ఎస్పీ ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ... ఎన్నికల సమయంలో ఎవరైనా రౌడీషీటర్లు, వారి అనుచరులు, లేదా ప్రభావిత వ్యక్తులు ప్రజలను బెదిరించడం, గొడవలకు ప్రేరేపించడం, మద్యం, డబ్బుతో ఓటర్లపై ప్రభావం చూపడానికి ప్రయత్నించడం వంటివి తీవ్రమైన నేరాలన్నారు. ఇలాంటి కార్యకలాపాల్లో ఎవరైనా పాల్పడితే, వారు ఎవరైనా కాని కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని  ఎవరెవరితో మర్యాదగా నడుచుకోవాలి, ఎవరితో దూరంగా ఉండాలి అన్నదానిపై స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తున్నాను.

మర్యాదగా వ్యవహరిస్తే మంచిదన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే సహించేది లేదని.. ప్రజల శాంతి భద్రతను కాపాడటం కోసం రాత్రింబవళ్లు పోలీసులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తారన్నారు. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేసే దిశగా మా పర్యవేక్షణ అత్యంత కఠినంగా కొనసాగుతుంది. ఎన్నికల శాంతి భద్రతను భంగం చేయాలనే ప్రయత్నం చేసే వారిపై పోలీసులు కన్నుగప్పకుండా నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డీఎస్పీ, బాలాజీ నాయక్, వనపర్తి సిఐ, కృష్ణయ్య, వనపర్తి పట్టణ ఎస్సై, హరి ప్రసాద్, వనపర్తి రూరల్ ఎస్సై, జలంధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.