5 March, 2026 | 8:45 AM

రేపు రాష్ట్రంలో మోస్తరు వానలు

13-10-2024 09:29 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. వర్షసూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.  ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని చెప్పింది.